రాజ్యాంగ విలువల స్పూర్తితోనే పనిచేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆందోళనకారులకు నాయకత్వం వహించడం సరికాదని మాజీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో నరవాణే తాజా కామెంట్స్ చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించడం శుభపరిణామం అన్నారు. సీడీఎస్‌తో త్రివిధ దళాలు సమగ్రతతో పనిచేస్తాయన్నారు. సీడీఎస్ సక్సెస్ కోసం ఆర్మీ కృషి చేస్తుందన్నారు. పీవోకే కూడా భారత్‌లో భాగమే కాదా అన్న రాజకీయవేత్తల అభిప్రాయాలపై కూడా ఆర్మీ చీఫ్ తన వాదన వినిపించారు. భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్ భాగమని పార్లమెంట్ తీర్మానం చేసిందని, ఒకవేళ పీవోకే కూడా మనదే అని తీర్మానం చేస్తే, అప్పుడు అది కూడా మనదే అవుతుందన్నారు. ఒకవేళ అలాంటి ఆదేశాలు మాకు వస్తే, అప్పుడు సరైన చర్యలు తీసుకుంటామన్నారు.
రాజ్యాంగ విలువల స్పూర్తితోనే పనిచేస్తాం : ఆర్మీ చీఫ్ నరవాణే