ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఫాల్కన్ ఏర్‌బుక్ పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేసింది. మార్‌క్యూ బై ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ కింద ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసింది. ఇందులో 13.3 ఇంచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.26 కిలోల బరువును మాత్రమే కలిగి చాలా స్లిమ్ డిజైన్‌తో లైట్‌గా ఉంటుంది. ఇందులో ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, 37 వాట్ అవర్ బ్యాటరీ, 5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఇతర ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు. రూ.39,990 ధరకు ఈ ల్యాప్‌టాప్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. దీనికి ఏడాదిపాటు డోర్ స్టెప్ వారంటీని అందిస్తున్నారు.
రూ.39,990కే ఫ్లిప్‌కార్ట్ నూతన ల్యాప్‌టాప్